రైతు బంధు కోసం కాంగ్రెస్ అందోళన

అదిలాబాద్ ముచ్చట్లు:


ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో .. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతుబంధును  రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ… ధర్నా  కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ… రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్… తాను గెలవడానికి ముందు ఇచ్చిన హామీలు అయినా ప్రతి రైతుకు రైతుబంధు పథకానికి కట్టుబడి వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయించాలని… ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎక్కడో పంజాబ్ లో ఉన్న రైతులకు 25 లక్షలు మన రాష్ట్ర ఆదాయం నుండి తీసుకు వెళ్లి ఇచ్చి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి మన    తెలంగాణ రైతులకు ఇంకా రైతుబంధు డబ్బులు జమ చేయించక పోవడం సిగ్గుచేటని… దీన్ని నిరసిస్తూ నేడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.

 

Tags: Congress concern for the peasantry

Post Midle
Post Midle
Natyam ad