Congress dharna in the center of the Addakkal Mandal

అడ్డాకుల మండల కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా

Date:17/02/2020

మహబూబ్ నగర్  ముచ్చట్లు:

సింగల్ విండో ఎన్నికల పై అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ సింగిల్ విండో మొదటి వార్డు టిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి

జితేందర్ రెడ్డికి 76 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శరత్ కుమార్ రెడ్డి కి 76 ఓట్లు  సమానంగా వచ్చాయి. రెండు ఓట్లు చెల్లని ఓట్లు గా ఒక ఓటు బ్యాలెట్ పేపర్ వెనకాల వేసిన ఓటు చెల్లదని

ప్రోసిడింగ్ అధికారులు నిర్ధారించారు.  ఎన్నికల అధికారి ఏకపక్ష నిర్ణయంతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు అడ్డకల్ మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

నాగీరెడ్డి మాట్లాడుతూ సమాన ఓట్లు వచ్చిన అభ్యర్థులకు టాస్ వేసి నిర్ణయించాలని కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని ఆయన వెల్లడించారు.  దీని పై అధికారులు స్పందించి ఇద్దరికీ

సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అలా చేయని పక్షంలో మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. మండల కేంద్రంలో ఉన్న మొత్తం 13వ

వార్డు లో లెక్కిస్తే తెరాస పార్టీ కన్నా 18 ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ జగదీశ్వర్, జిల్లా కార్యదర్శి విజయ్ మోహన్

రెడ్డి,, ఎంపీటీసీ శకుంతల, దశరథ రెడ్డి, షఫీ హైమద్, శ్రీహరి, సాయన్న, మైనాదిన్, నిరంజన్ గోరి, బాలరాజ్, బాలయ్య, నవీన్ చారి, జగదీష్ చారి, వెంకట్ రెడ్డి తదితర నాయకులుపాల్గొన్నారు.

కాలువలో కారు…ముగ్గురు మృతి

Tags: Congress dharna in the center of the Addakkal Mandal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *