పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ ధర్నా

భువనగిరిముచ్చట్లు:

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భువనగిరి పట్టణంలో పెట్రోల్ బంక్ ఎదుట నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలంటూ ఎరవేసి నిత్యావసర, చమురు  ధరలను పెం చుతూ ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ పెంచిన ధరలు నిరసనగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధర్నా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వని విమర్శించారు పెట్టుబడిదారుల కోసం మినహాయింపులు, పేదలకు మొండిచేయి చూపిస్తోందన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని, కార్మిక, కర్షక వ్యతిరేక నిర్ణయాలను వెన క్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ కౌన్సిలర్లు ప్రమోద్ కుమార్,ఇరపాక నర్సంహ్మ,మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Congress dharna on petrol prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *