ప్రైవేట్ వర్శిటీలపై  కాంగ్రెస్ ఫైర్

Date:25/05/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ష్ట్రంలో ఐదు ప్రయివేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కానుండగా.. అందులో మహీంద్రా, వోక్స్ సేన్ మినహా మిగతా మూడు యూనివర్సిటీలు టీఆర్ఎస్ నేతలకు చెందినవి కావడం వివాదానికి దారి తీస్తోంది. తెలంగాణ సర్కారు నిర్ణయం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. గత ఆరేళ్లలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌లను కూడా కేసీఆర్ సర్కారు నియమించలేదని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క ఐఐటీని కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.ఓ పక్క ప్రజలు కరోనా వైరస్ గురించి ఆందోళన చెందుతుంటే.. కేసీఆర్ సర్కారు మాత్రం ప్రయివేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చిందని.. ఆర్థిక వనరులు సమకూర్చే వ్యక్తులకే యూనివర్సిటీలను కట్టబెడుతున్నారని భట్టి విమర్శించారు. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, వరదా రెడ్డిలకు యూనివర్సిటీలు కేటాయించడం దారుణమంటూ భట్టి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో ఐదు ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపితే అందులో మూడు టీఆర్ఎస్ నేతలవే. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలు, కొత్త కోర్సులు, హాస్టళ్లు, భవనాలు, ఇతర వసతుల మాటేమిటి?’’ అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.

కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Tags: Congress Fire on Private Varsities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *