కాంగ్రెస్ మోసం చేసింది అంబరీష్

The Congress suffered a stroke before the Karnataka Assembly polls. The senior party leader, Rebel Star Ambarish, has been making a sensational announcement. To say goodbye to the party during the crucial election .. big party to the party. The name of Mandya is already announced by the name of Ambresh

Date:25/04/2018
బెంగళూర్  ముచ్చట్లు:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, రెబల్‌ స్టార్‌ అంబరీష్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. కీలక ఎన్నికల సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పడం.. పార్టీకి పెద్ద మైనస్సే. మాండ్యా స్థానానికి ఇప్పటికే అంబరీష్ పేరును ప్రకటించిన కర్ణాటక కాంగ్రెస్‌కు.. ఆ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన తక్షణ అవసరం ఏర్పడింది. తనకు వయసు మీద పడుతోందని, అందువల్లే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని అంబరీష్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి అంబరీష్‌కు కాంగ్రెస్‌ టికెట్ ‌కేటాయించినా.. ఆయన బీ ఫారమ్‌ మాత్రం తీసుకోలేదు. తన అనారోగ్యం రీత్యా ఎన్నికల్లో ప్రచారం చేయబోనని ఆయన తెలిపారు. మాండ్యా నియోజకవర్గం నుంచి ఎవరితోనైనా నామినేషన్ ‌వేయించాలని పార్టీకి సూచించారు. దీంతో మే 12న జరిగే ఎన్నికల్లో మాండ్యా నుంచి మరో వ్యక్తిని బరిలో దించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు అనివార్యమైంది. ‘ఒకవేళ నేను అసెంబ్లీకి ఎన్నికైనా.. ప్రజలకు న్యాయం చేయలేను. అందువల్లే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా’ అని అంబరీష్ తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానానికి తాను ఎవరి పేరును సూచించలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి తరఫునా ప్రచారం చేయబోనని కూడా కుండబద్దలు కొట్టారు.
TAgs:Congress has cheated Ambresh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *