ముందునుంచి తెలగాణకు కాంగ్రెస్ ద్రోహం 

-విరుచుకపడ్డ సీఎం కేసీఆర్
Date:14/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మొదటినుంచి తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పై అయన విరుచుకుపడ్డారు.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం, ద్దరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని కేసీఆర్ సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు..ఏర్పడిన తరువాత కాంగ్రెస్ విలన్ గా ఉందన్నారు. 1956 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ వినాశనానికి కారణం తెలంగాణ కాంగ్రెస్. నెహ్రూకు భయపడి అప్పటి కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు అంగీకరించారు. పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు ఉద్యమాన్ని అణిచివేశారని అయన విమర్శించారు.  1999లో ఉద్యమం ప్రారంభం అయ్యింది. వేల గంటలు చర్చ చేయడం జరిగిందన్నారు. 2001లో ఏప్రిల్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో ఉద్యమం ప్రారంభించడం జరిగిందని, తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ అని జలదృశ్యంలో పేర్కొనడం జరిగిందన్నారు. తాను బాధ్యత లేకుండా ఈ విషయం చెప్పలేదని, ఆ నాటి నుండి ఈ నాటి వరకు కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉందన్నారు. 1969లో కూడా కాంగ్రెస్ విలన్ అని సభకు తెలిపారు. మలిదశ ఉద్యమానికి కారణం కాంగ్రెస్ అని అయన అరోపించారు. ఢిల్లీ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మూకుమ్మడి రాజీనామాలకు సైతం ఢిల్లీ అనుమతి కావాలా అని అయన ప్రశ్నించారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాను. జానారెడ్డి తెలంగాణ ఫోరం పెట్టి,  కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వగానే చల్లబడ్డారు. చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర కోర్డినేషన్ కమిటీ పెట్టి రాజశేఖరరెడ్డి భజన చేశాడు. ఉద్యమ సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు పత్రికలతో మాట్లాడిన మాటలను సీఎం కేసీఅర్ చదివి విన్పించారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్  అసెంబ్లీలో  తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అభ్యంతరం తెలపలేదు. ఇది తెలంగాణపై కాంగ్రెస్ చితశుద్ది అని వ్యాఖ్యానించారు. ఇలాంటివారా తెలంగాణ గురించి మాట్లాడేది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని చెప్పినా కాంగ్రెస్ పార్టీలో ఇంత అసహనం ఎందుకు?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
హైద్రాబాద్ మీద నేను రాజీ పడి ఉంటే నాలుగేళ్ళ ముందే తెలంగాణ వచ్చేది.  ఉద్యమ కారుడిగా  తెలంగాణ తేవటం ఎంత ముఖ్యమో రాజకీయ సుస్థిరత తేవటం కూడా అంతే ముఖ్యమని అయన అన్నారు. మా ప్రభుత్వాన్ని కూల్చాలని కొందతు ప్రయత్నించారు.  మేం వంద శాతం నిస్వార్థంగా పనిచేస్తున్నాం. ఆల్ లైన్ టెండర్లలో ఎవరికైనా కాంట్రాక్టు పనిలొస్తాయి. కోమటిరెడ్డి వాళ్ళ కంపెనీలకు కూడా ఇదే విధంగా పనులొచ్చాయి. అవినీతి అంటూ కొందరు గాలి వార్తలు ప్రచారం చేస్తున్నారని అయన అన్నారు.   నాలుగేళ్లలో ప్రభుత్వం లక్షల కోట్ల అప్పు చేసిందని విపక్షాలు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్ర అప్పు రూ.72వేల కోట్లు ఉంటే.. ఈరోజుకు పాతవి, కొత్తవి అన్ని కలిపి రూ.1.42కోట్లకు అప్పు చేరిందని ప్రకటించారు.  ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేద్దామంటే కుదరదని.. ప్రతి పైసా పైనా ఆర్బీఐ నిఘా ఉంటుందన్నారు.
Tags: Congress is betraying Telangana from before

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *