కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి భాజపాలో చేరిక

Congress leader Damodara Rajarasimha's wife join BJP

Congress leader Damodara Rajarasimha's wife join BJP

Date:11/10/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ సతీమణి సంఘసేవకురాలు, పద్మిని రెడ్డి భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో ఆమె కమలం తీర్థం పుచ్చుకున్నారు. భాజపాలో పద్మిని రెడ్డి చేరికను స్వాగిస్తున్నట్టు నేతలు తెలిపారు. దేవాలయాల పునరుద్ధరణకు పద్మిని రెడ్డి ఎంతగానో కృషిచేశారని, రాబోయే రోజుల్లో ఆమె సేవలను పార్టీకి వినియోగించుకుంటామని కమలనాథులు తెలిపారు. ఆమెకు రాజకీయాలు, సంఘసేవ కొత్త కాదని లక్ష్మణ్‌ చెప్పారు. తెలంగాణలో ‘మార్పు కోసమే భాజపా’ అనే నినాదం ఇచ్చిన నేపథ్యంలో ఈ చేరికలు తమకు కొత్త బలాన్ని ఇస్తుందని మురళీధర్‌రావు చెప్పారు. మహిళలకు పెద్దపీట వేస్తున్న పార్టీగా భాజపాను గుర్తించి ఆమె చేరారని లక్ష్మణ్‌ తెలిపారు. తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయం అని విశ్వసించి తమతో కలిసి పనిచేసేందుకే పద్మినిరెడ్డి వచ్చారన్నారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేస్తామని ప్రకటించారు.
Tags:Congress leader Damodara Rajarasimha’s wife join BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *