కాంగ్రెస్ నేతల ధర్నా..ఆరెస్టు

విజయవాడ ముచ్చట్లు:


విజయవాడ ఆంధ్ర రత్న భవన్ వద్ద శుక్రవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్ భవన్  ఘెరావ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ తో పాటు ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు జంగా గౌతమ్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహా రావు తదితరులు పాల్గోన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

అంతకుముందు శైలజానాథ్ మాట్లాడుతూ ధరలు పెరుగుదల పన్నుల భారాలతో పేదవాడు బ్రతకలేక పోతున్నాడు. మోదీ, జగన్  నాయకత్వంలో ప్రజలపై దోపిడీ పెరిగి పోయింది. పేదలు బ్రకలేని పరిస్థితినీ ప్రధాని మోడీ తెచ్చారు. ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి  సీఎం జగన్ మద్దతుగా ఉన్నారు . జీయస్టి వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. మజ్జిగ, లస్సీ, ప్యాకెట్ లపై కూడా జియస్టీ దారుణమని అన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి ప్రజలను దోచుకుంటున్నారు. మోడీ, జగన్ లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ప్రజా స్వామ్య బద్దంగా నితసన తెలిపినా అరెస్టు చేయిస్తున్నారని అయన మండిపడ్డారు.

 

Tags: Congress leaders’ dharna..arrested

Leave A Reply

Your email address will not be published.