కాంగ్రెస్ నేతలకు దిక్కు లేదు

Congress leaders do not have to go

Congress leaders do not have to go

Date:20/10/2018
కరీంనగర్ ముచ్చట్లు:
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి లో మంత్రి ఈటెల రాజేందర్, తెరాస అభ్యర్ధి రసమయి బాలకృష్ణ  శనివారం  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ  తెరాస అభ్యర్ధులను  భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.  మహా కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయాలన్నఅన్నారు. కాంగ్రెస్ కి ఏదో ఉంది అని వారు భ్రమపడుతున్నరు. వారికిఊళ్లల్లో ఓటర్లు దిక్కులేరు. ప్రభుత్వ పథకాలు నచ్చి ప్రతి ఊరు ఏకగ్రీవ తీర్మానం చేస్తుంటే ఇంకా వారి ఉనికి ఎక్కడ అని ప్రశ్నించారు.  ముసలి వారికి కెసిఆర్  పెద్దకొడుకు అయ్యారు. 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నారు. ఇప్పుడు అది 2016  కానుంది.
65 కాదు 57 సంవత్సరాల వారికే పెన్షన్ రాబోతుందని మంత్రి అన్నారు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం దొరికే వరకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి అందనుంది. ఒక్కరూపాయి సాయం అందని వారికి సైతం వెలారూపాయలు అందించి ప్రభుత్వం అండగా ఉంటుంది దేశం లో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డకు కట్నం ఇస్తున్నా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 116  రూపాయలు కల్యాణలక్ష్మి అందిస్తున్నామని అన్నారు. రైతు బంధు ఇస్తారని ఎవరు ఉహించలే దు.  రైతు ప్రభుత్వం కాబట్టే వచ్చే సంవత్సరం నుండి 10000 ఇస్తామని అన్నారు. చెక్కులు రాని రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకి చెక్కు అందజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కంచుకోట లు బద్దలు అవుతున్నాయి. వారికి గెలుపు అందని ద్రాక్ష నేనని అయన వ్యాఖ్యానించారు.
Tags:Congress leaders do not have to go

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *