Natyam ad

కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకు రాయాలి-మంత్రి జగదీష్ రెడ్డి

నల్గోండ ముచ్చట్లు:

ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…అది తెలువకుండా దాని గురించి మాట్లాడితే చదువుకున్నోళ్లు మాత్రమే కాదు కంప్యూటర్ పై సరయిన పరిజ్ఞానం లేని వారు కూడా నవ్వుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. అది తెలియాలి అంటే కనీస పరిజ్ఞానం ఉండాలి అని ఆయన దెప్పి పొడిచారు. పట్టణ ప్రగతి లో బాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగినకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి అనంతరం మీడియా తో మాట్లాడారు.చదవని చదువు చదువుకున్నట్లు చెప్పి వై ఎస్ దగ్గర పదవులు పొంది డబ్బులు సంపాదించుకున్నట్లు కాదని ఐటీ హబ్ లగురించి తెలుసుకోవడం అని ఆయన విరుచుకుపడ్డారు.20 ఏండ్లుగా అధికారం లో ఉండి నల్లగొండ అభివృద్ధికి చేసింది ఏమిటో తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నేతల పాదయాత్రలో త్రాగేదిముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన మంచి నీరు అని,కాంగ్రెస్ నాయకుల పొలాలకు,ఇళ్లకు అందుతున్న విద్యుత్ ముఖ్యమంత్రి కేసీఆర్ సరఫరా చేసిందేనని ఆయన మండిపడ్డారు. మాటి మాటికి అవాకులు
చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ నాయకులు చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. మీకు మాలాంటి నేతలఅక్కర లేదని అభివృద్ధిలో భాగస్వామ్యం అయి మాతో సెల్ఫీలు దిగుతున్న ప్రజలుసరితూగుతారని ఆయన చెప్పారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి దండు బయలు దేరిందని ఆ దండుపై ప్రజలకు విశ్వసనీయత లేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్నల్లగొండ ను దత్తత తీసుకున్నాక రూపు రేఖలే మారి పోయాయని ఆయన చెప్పారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి గురించే కాదు వ్యవసాయం గురించి మాత్రం ఏమి తెలుసని ఆయన

 

Post Midle

నిలదీశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క యాసంగి లొనే 17 వేల ధాన్యం దిగుబడి కాగా రైతులకు చెల్లించిన మొత్తం2,950 కోట్లు అని ఆయన చెప్పారు. క్షమాపణలు కాదు కాంగ్రెస్ నేతలే గల్లీ నుండిఢిల్లీ వరకు 1000 సార్లు ముక్కులు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.ఫ్యూడల్ రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు.ఐదు ఎకరాల భూమి ఉంటే అన్న తమ్ముళ్లకు కోటాను కోట్లబెంజి కార్లు ఎక్కడివని ఆయన నిలదీశారు.మళ్ళీ అధికారంలోకి వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే ఇందులో ఎటువంటి సందేహం లేదని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

Tags: Congress leaders should put their noses on the ground – Minister Jagdish Reddy

Post Midle