రాహుల్ పై పోటీకి సై అంటున్న కాంగ్రెస్ నేతలు

 Date:26/03/2019
లక్నో ముచ్చట్లు:
ఏడు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కొనసాగి రాజీవ్ గాంధీ, సోనియాలకు విధేయులుగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి నేడు రాహుల్‌పై పోటీకి సిద్ధమవుతున్నారు. అమేథిలో రాజీవ్ గాంధీ, సోనియాల అభ్యర్థిత్వాలను బలపరిచిన వ్యక్తి కుమారుడు హజీ మహ్మద్ హరూన్ రషీద్ ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి అమేథి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ జరగకపోవడమే కారణమని హరూన్ వ్యాఖ్యానించాడు. అమేథి అభివృద్ధివిషయంలో కాంగ్రెస్ పార్టీ చెబుతోన్న దానికి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని, నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎక్కడ చూసినా పేదరికమే కనిపిస్తుందని అన్నారు. దీనిపై ఎవరైనా గ్రామాలకు పరిశీలించవచ్చని వ్యాఖ్యానించారు.నియోజకవర్గంలో సమస్యలను గుర్తించడంతోనే వాటి పరిష్కారం కోసం ఈ ఎన్నికల్లో రాహుల్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు అతడు వివరించాడు. తన తండ్రి మహ్మద్ సుల్తాన్ చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో చేరారని, గత 70 ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తూ మద్దతుదారులుగా ఉన్నామని స్పష్టం చేశాడు. కానీ, అమేథి అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించడంతో ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు హరూన్ వెల్లడించారు. 70 ఏళ్లు అనేది చాలా ఎక్కువ కాలం, ఇప్పుడు కూడా మేల్కోకపోతే ఎప్పటికీ అమేథీ అదృష్టంలో మార్పురాదని అన్నారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ దీనిపై నిర్ణయం తనదేనని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల వెనుక సమాజ్‌వాదీ పార్టీ నేతలున్నారనే ప్రచారం సాగుతోంది.
Tags:Congress leaders who are going to contest against Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *