ఎమ్మెల్యే కందాలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కూసుమంచి మండలంలో పాలేరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పరాభవం ఎదురయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద ఘటన జరిగింది.  184,185,186,187   బూతులలోకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి పోలింగ్ బూతులోకి ప్రచారం  చేయడంతో కాంగ్రెస్ పార్టీ వర్గీయులు నిలదీసారు. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేసారు.

 

పోలింగ్ కేంద్రాల లో కి వెళ్ళి  “ఈవిఎం  ల దగ్గరకు వెళ్లి ఓటర్లను ప్రలోభాల గురిచేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ఆందోళన చేసారు. పోలింగ్ కేంద్రాల నుండి ఉపేందర్ రెడ్డి బయటకు రావడంతో కొంతమంది  కార్యకర్తలు జై కందాల అంటూ నినాదాలు పోటాపోటీ నినాదాలు చేసారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  జై శీనన్న జై శీనన్న అంటూ నినాదాలు చేసారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అదుపులోకి తీసుకొచ్చారు.

 

Post Midle

Tags: Congress leaders who blocked MLA’s actions

Post Midle