తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్  ముచ్చట్లు:

 

 


తెలంగాణలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేసీఆర్‌పై సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నారు.
గతంలో గులాబీ బాస్ తమపై చేసిన విమర్శలకు గెలుపుతో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు్న్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుండి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేసీఆర్‌పై సెటైర్ వేశారు. తుమ్మ ముళ్లు బాగా గుచ్చుకున్నట్లేనా అంటూ కేసీఆర్ ఉద్దేశిస్తూ తుమ్మల సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
తుమ్మల పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పంది స్తున్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాధ సభలో కేసీఆర్ తుమ్మలపై సెటైర్లు వేశారు.
ఖమ్మం ప్రజలకు పువ్వాడ పువ్వులు కావాలా.. తుమ్మల తుప్పలు కావాలా..? ఎన్నికల్లో తుమ్మలను గెలిపిస్తే మీకు తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయని కేసీఆర్  ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ తరుఫున ఖమ్మం నుండి బరిలోకి దిగన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌పై 40 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

 

Tags: Congress leaders who won big in Telangana

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *