ఉద్రిక్తతంగా కాంగ్రెస్ భేటీ
వరంగల్ ముచ్చట్లు:
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు మీసం మెలేయగా, మరో నేత ఇనగాల వెంకట్రామ్రెడ్డి తొడకొట్టడం, ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు, వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మండలం అగ్రంపహాడ్లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ రవీంద్ర ఉత్తమ్రావు దల్వీ హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్సీ కొండా, పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి వర్గీయులు.. పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ శోభారాణి కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని.. పార్టీ నినాదాలు, జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోయారు.
Tags: Congress meeting tense

