కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దం : కోమటిరెడ్డి

Date:14/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
 రాజ్యాంగాన్ని అణదొక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ అడ్డుకొంటోందని కాంగ్రెస్ నేత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గజ్వేల్లో పర్యటించినందుకే తనపై కేసీఆర్ కక్ష పెంచుకున్నారని  అయన ఆరోపించారు.. తమ శాసన సభ్యత్వం రద్దుకు నిరసనగా బుధవారం నాడు గాంధీ భవన్లో వెంకట్రెడ్డి, సంపత్ లు నిరసన దీక్ష చేపట్టారు.  తాము చేసిన ఆందోళనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సింది పోయి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని అయన అన్నారు.  దీనిపై తాము పోరాటం చేస్తాం. హైకోర్టుకు వెళుతున్నట్లు అయన  పేర్కొన్నారు. సోమవారం నాడు జరిగిన ఘటనలో టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు మంగళవారం స్పీకర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైకాపా ఎమ్మెల్యే రోజా ను సస్పెండ్ చేసిన సమయంలో సంవత్సరం పాటు విచారణ చేశారన్నారు.  ఉప ఎన్నికలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే రాహుల్తో మహబూబ్నగర్, నల్గొండలో సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు సభలో ఉండి ఏం చేస్తారు?.. అందరం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్కు కూడా సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఏఐసీసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్పై రాష్ట్రపతిని కలుస్తామన్నారు. శాసనసభ్యత్వం కోల్పోయిన మరో కాంగ్రెస్ నేత సంపత్ మాట్లాడుతూ… తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్పై హైకోర్టుకు వెళ్తామన్నారు. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సంపత్ అన్నారు.  గాంధీ భవన్ దీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా  హజరయ్యారు. నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్కు తరలివచ్చారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మంగళవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లను శాసనసభ సభ్యత్వాల నుంచి బహిష్కరించటంతో రెండు ఖాళీలు ఏర్పడినట్లు అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపించారు.
Tags: Congress MLAs are ready to resign: Komati Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *