Date:13/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
శాసనసభ నుంచి 11 మంది కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సోమవారం నాడు శాసనసభలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఘటనపై స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి ఘటనపై ఇవాళ అసెంబ్లీ ప్రారంభం కాగానే సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. సీఎల్పీ నాయకుడు జానారెడ్డి సహా పది మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక అనుబంధ సభ్యుడి సస్పెన్షన్‌ను అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, జగీతారెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వంశీచందర్‌రెడ్డి, ఉత్తమ్, డీకే అరుణ, ఎన్.పద్మావతిరెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లను శాసనభ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.మంత్రి హరీష్ రావు వెంటనే మరో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్ మాట్లాడుతుండగా అనుచితంగా ప్రవర్తించారంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాల రద్దుకు నిర్ణయించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం సస్పెండైన సభ్యులు సభను వీడాలని స్పీకర్ కోరారు. మండలి ఛైర్మన్‌పై జరిగిన దాడి చూసి తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చగా నిలిచిపోతుందని అన్నారు. ఘటనపై తీవ్ర మనస్థాపం వ్యక్తం చేశారు.మంగళవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలకు ఇంత అసహన వైఖరి సరికాదని అన్నారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ నిర్ణయం కఠినమే.. కానీ తప్పదన్నారు. కాంగ్రెస్ నేతలు సభ లోపల, బటయ ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటన్నారు. తెలంగాణలో నాలుగేళ్ల నుంచి ప్రజలు సంతోషంగా ఉన్నారని… నాలుగేళ్ల నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అయన అన్నారు. అరాచక శక్తులను అణచివేయడంలో వెనుకడుగువేసేది లేదన్నారు. ప్రజాప్రతినిధుల ముసుగులో ఏదైనా చేస్తామంటే కుదరదన్నారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్ని రోజులైనా చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ నేతలు గొడవ చేయడం సబబు కాదన్నారు. సభా హక్కులకు భంగం కలిగించొద్దని సీఎం సూచించారు. కాంగ్రెస్ నేతలే నాటకాలు ఆడుతున్నారు. తమకు నాటకం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సభలో కూర్చుంటే వచ్చది ఏమీ లేదు. ఎలాగైన బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం సమయంలో దాడి చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్లు తమకు సమాచారం ఉందని సీఎం చెప్పారు.
Tags: Congress MLAs suspended