Natyam ad

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

జగిత్యాల ముచ్చట్లు:

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌చేశారు. వెల్గటూరు మండలం షాహిగామ వెళ్లేందుకు సిద్ధమైన జీవన్‌రెడ్డి..ఇథనాల్‌ ప్రాజెక్ట్‌ బాధితులను(కలిసేందుకు సిద్ధం కావడంతో ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్‎లనుహౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజక వర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే అరెస్టులతో నిర్బంధిస్తారా అంటూ రేవంత్ మండిపడ్డారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‎ల్ లాంటి ప్రజా నాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం అవుతుందని, ప్రజలు, రైతులు ఇథనాల్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల పోరాటానికి జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమారులు సంఘీభావం ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా.. ఇది ప్రజాస్వామ్యమా..? ప్రతిపక్ష పార్టీ మండలి నాయకుడిని నిర్భందిస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్‎లను వెంటనే విడుదల చేసి పోరాటంలో భాగస్వాములను చేయాలని కోరారు. రైతులు, ప్రజలు కోరుకున్న విధంగా విధానాలను అమలు చేయాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Post Midle

Tags;Congress MLC Jeevan Reddy house arrest

Post Midle