కరోనా బాధితులకు అండగా కాంగ్రెస్

సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క
తూమాటి సేవలు అభినందనీయం.

ఖమ్మంముచ్చట్లు :

కరోనా బాధితులకు  కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పనిచేస్తుందని, సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న కరోనా బాధితులకు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు అన్నారు.కరోనా బాధితులకు నేటి నుంచి అల్పాహారం అందించడం అనేది అభినందనీయం అని తూమాటి సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  సూరంశెట్టి కిషోర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,కోనా ధని కుమార్ పారుపల్లి విజయ్  దారా బాలరాజు కర్నాటి రామారావు  షేక్ జహంగీర్, కోరం పల్లి చంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల కార్తిక్ ,మందలపు సుధీర్ , ఆవుల మురళి , బి. మనిచంద్, శాఖముడి శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Congress on behalf of corona victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *