గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు: ఎంపీ కవిత

Congress Party crocodile tears for Gulf workers: MP poem

Congress Party crocodile tears for Gulf workers: MP poem

Date:10/11/2018
నిజామాబాద్‌  ముచ్చట్లు:
 కాంగ్రెస్ నేతలు గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి కార్మికులను పరామర్శించడం విడ్డూరంగా ఉందని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. గల్ఫ్ కార్మికుల పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని.. ఇప్పటివరకూ గుర్తుకు రాని గల్ఫ్ కార్మికుల పట్ల ఇప్పుడెందుకు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే గల్ఫ్ కార్మికుల కోసం ఖర్చు చేస్తే..
తెరాస నాలుగేళ్ల పాలనలో రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశామని ఆమె వివరించారు. నిజామాబాద్‌లో కవిత మీడియాతో మాట్లాడారు.గల్ఫ్ దేశాల్లో చనిపోయిన 1278 కార్మికులను ప్రభుత్వ ఖర్చులతో స్వగ్రామాలకు తీసుకొచ్చామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచి బకాయి సొమ్మును కూడా చెల్లించామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించడం కూడా కేసీఆర్ ఆలోచనేనని.. రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కేంద్రంతో కలిసి సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపుల్ల వేస్తున్నారని విమర్శించారు. భాజపాకు తెలంగాణలో దిక్కులేదని…. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి రెండు కార్పొరేట్ స్థానాలు రావడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
Tags: Congress Party crocodile tears for Gulf workers: MP poem

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *