Natyam ad

కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయండి-కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా

బద్వేలు ముచ్చట్లు:



సోనియాగాంధీపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బిజెపి చర్యను ఖండించండి.సోనియాగాంధీపై అక్రమంగా ఈడీ విచారణ జరిపించడం దుర్మార్గమైన చర్య ఈనెల 26వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగనున్న దీక్షలో వేలాదిగా పాల్గొనండి.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రండి.బిజెపి అప్రజాస్వామిక విధానాలను ఎదుర్కొందాం.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.సోనియా, రాహుల్ గాంధీల పై అక్రమ ఈడి కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయడం మీ తరంకాదు. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమం నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ సమైక్యత, సమగ్రత కాపాడటం కోసం ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ బలిదానాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ బిజెపి ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు కాంగ్రెస్ భయపడదు ఈనెల 26వ తేదీ జరుగు సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

 

Tags: Congress Party’s Satyagraha initiative is a success – Congress Party Spokesperson Sheikh Saida

Post Midle