ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నిరసన కార్యక్రమం

హైదరాబాద్ ముచ్చట్లు:


నిత్యావసర వస్తువుల ధరలు రికార్డ్ స్థాయి పెరిగిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలపై జిఎస్టీ పెంచడం, అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు, విపరీతమైన నిరుద్యోగం, అగ్నిపత్ పేరుతో సైనికులను అవమాన పరచడం, రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లాంటి చర్యలను నిరసిస్తూ రాజ్ భవన్ ముట్టడికి  కాంగ్రెస్ పిలుపునిచ్చింది.పెట్రోల్ , డీజిల్ ధరలతోపాటు నిత్యావసర వస్తువులు, జీఎస్టీ పెంపు, నిరుద్యోగం, రాష్ట్రంలో వరదలకు కేసీఆర్ సర్కార్ సాయం చేయకపోవడం పట్ల   కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.

 

 

ఈ ధర్నాలో  ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జవీద్ రోహిత్ చౌదరి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్, మైనారిటీ సెల్ చైర్మన్ సోహైల్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.  టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ధర్నా లో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి మొదటి సారి తెలంగాణ కు వచ్చారు.

 

Tags: Congress protest at Indira Park

Leave A Reply

Your email address will not be published.