Natyam ad

రోడ్ల పై వరి నాట్లు కాంగ్రెస్ నిరసన

రంగా రెడ్డి ముచ్చట్లు:


బడంగ్ పేట్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాదర్గుల్ గ్రామంలో గుంతల మయంగా మారిన రోడ్ల పై కాంగ్రెస్ పార్టీ నాయకులు వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 27వ డివిజన్ లో అస్తవ్యస్తమైన రోడ్ల పై ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు,కిందపడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని వెంటనే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన సబిత ఇంద్ర రెడ్డి,అభివృద్ధిని మర్చిపోయి,సొంత ఖజానాను నింపుకుందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారి బాబు అన్నారు. అభివృద్ధి చేయడం మర్చిపోయి శిలాఫలకాలికే  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పరిమితమైంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బిజెపి పార్టీ కార్పొరేటర్లకు ఆక్రమంగా వసూలకు పాలుపడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని అన్నారు. అధ్వానంగా ఉన్న రోడ్లను కార్పొరేటర్ శ్రీధర్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దబావి వెంకటరెడ్డి,మహేశ్వరము యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి,సుభాన్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Congress protest planting paddy on roads

Post Midle
Post Midle