నేతల అక్రమ అరెస్టులకు కడపలో కాంగ్రెస్ నిరసన

పోలీసులకు రోజా పూలు..

కడప ముచ్చట్లు:

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,అగ్రనేత రాహుల్ గాంధీ పై ఈడీ కేసులు బనాయించి కేంద్ర బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకుని పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తుండడం సరైన చర్య కాదని, కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నీలి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో, కాంగ్రెస్ శ్రేణులు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు రోజాపూలు వచ్చి తమ నిరసనను తెలియజేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం  కక్షపూరిత విధానాలు విడనాడాలని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు.రాహుల్ గాంధీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర తలపెట్టారని, ప్రజల సమస్యలపై రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు గళమెత్తి ఉన్నారని, ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు.2024లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ హయాంలో వంటగ్యాస్ 400 రూపాయలు కాగా, బిజెపి హయాంలో 1100, కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ 60 రూపాయలు కాగా, బిజెపి హయాంలో 130 రూపాయలు,కాంగ్రెస్ హయాంలో వంటనూనె 70 రూపాయలు కాగా, బిజెపి హయాంలో వంటనూనె 200 రూపాయలు అని, కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తూ ఉంటే, బిజెపి హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవన్నారు.రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో మళ్లీ ప్రజలు సంతోషంగా ఉంటారు అన్నారు.వన్ టౌన్ సిఐ నాగరాజు అందుబాటులో లేకపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ సిద్దయ్య కు, ఇతర పోలీసు సిబ్బందికి  రోజా పూలు ఇచ్చి తమ నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాస రావు తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సత్తార్, చార్లెస్, ఎన్ ఎస్ యు ఐ నేత తిరుమలేష్, మల్లెం విజయ భాస్కర్, ఆరిఫ్ ఉల్లా, జిల్లా నేతలు గొర్ల శ్రీనివాసులు,  మైన్ ఉద్దీన్, కోపురి  శ్రీనివాసులు, వేణుగోపాల్, రఫీ ,సత్యం పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Congress protests in Kadapa over illegal arrests of leaders

Post Midle
Natyam ad