రెండు వర్గాలుగా కాంగ్రెస్ నిరసనలు
ఖమ్మం ముచ్చట్లు:
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్,పెట్రోల్, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిరసనలు జరిగాయి. సత్తుపల్లి లో మరోసారి వర్గ విభేదాలతో వేరు వేరుగా పార్టీ నేతలు మహా ధర్నా చేపట్టారు. ద్విచక్ర వాహనం ను రిక్షా పై ఎక్కించి రిక్షా తొక్కుతూ టి పిసిసి అధికార ప్రతినిధి మానవతా రాయ్ ర్యాలీగా ప్రదర్శన చేసారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి సంభానీ వర్గీయులు టెంట్ వేసి మహా ధర్నా కు దిగారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ లో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. రెండు గ్రూపులుగా నిరసనలకు దిగారు.
Tags: Congress protests in two factions