కుప్పం లో  కాంగ్రెస్ ‘రణ శంఖారావం’

Congress 'rakshanam' in Kuppam

Congress 'rakshanam' in Kuppam

 Date:27/05/2018
చిత్తూరు ముచ్చట్లు :
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీలు, పునర్నిర్మాణ చట్టంలోని అంశాలు అమలు చేయకుండా ఆంధ్రకు బిజెపి తీరని ద్రోహం చేసిందని అఖిల  భారత  కాంగ్రెస్ పార్టీ సభ్యులు సురేష్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలో బిజెపి వైఖరికి నిరసనగా మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా  అయన మాట్లాడుతూ  ప్రధాని  మోడీ ఎన్నికల  హామీలను నెరవేర్చకుండా  నాలుగేళ్లు కాలయాపన చేసారని  ఎద్దేవా  చేసారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ   పార్లమెంటులో అవిశ్వాసం పెడితే సమాధానం చెప్పలేక పారిపోయారని విమర్శించారు. రాష్ట్రాలలో సీట్లు రాకపోయినా  అడ్డుగోలుగా  అధికారం కోసం వెంపర్లాడే  మోదీ పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర్లోనే ఉందన్నారు. విదేశాలలో  ఉన్న నల్లధనాన్ని దేశానికీ  తీసుకువస్తానని  చెప్పిన మోదీ మధ్యతరగతి   ప్రజలు  బ్యాంకుల్లో  దాచుకున్న డబ్బును  లక్షల  కోట్ల  ధనాన్ని దొరలకు పంచి  విదేశాలకు పంపిన ఘనత  దేశంలోని  ప్రధానుల్లోకెల్లా  ఒక్క  మోడీకే  సాధ్యపడిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
TAgs:Congress ‘rakshanam’ in Kuppam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *