సామాజిక వేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ ను సన్మానించిన కాంగ్రెస్  జువ్వాడి కృష్ణారావు ..

కోరుట్ల  ముచ్చట్లు:

మనిషికి తల్లి జన్మనిస్తే .. రక్తదాత పునర్జన్మనందిస్తారని, రక్తదానం పై యువతలో అపోహలు నెలకొన్న సందర్భంలో యువతలో రక్తదానంపై అవగాహన కల్పించి కోరుట్ల పట్టణాన్ని రక్తదాతలకు నిలయంగా మార్చిన ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక వేత్త కటుకం గణేష్ సేవలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.. రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని రక్తదాన ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న సామాజికవేత్త కటుకం గణేష్ ను కృష్ణారావు సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మనందించేది రక్తదానమేననీ, అలాంటి రక్తదాత ప్రాణదాతతో సమానమని, రక్తదాన అనుసంధానకర్తగా ఇదివరకు పలు ప్రభుత్వ, స్వచ్చంధ సంస్థల నుండి అవార్డులు, పురస్కారాలు స్వీకరించిన కటుకం గణేష్ సేవా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నారని నియాడారు..ఇప్పటికైనా యువత రక్తదానంపై అపోహలు వీడి స్వచ్చంధ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు..

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Congressman Juvvadi Krishna Rao honors sociologist and blood donor Katukam Ganesh.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *