కుటుంబ సభ్యులకే నచ్చని కాంగ్రెస్  మ్యానిఫెస్టో

Congressman Manifesto does not like family members

Congressman Manifesto does not like family members

Date:11/10/2018
సంగారెడ్డి  ముచ్చట్లు:
దామోదర్ రాజనర్సింహ  కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్.అయన చేసిన మ్యానిఫెస్టో ఆయన కుటుంబ సభ్యులకే నచ్చలేదు. అందుకే ఆయన భార్య పార్టీ మారిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. గురువారం నాడు అయన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లో అందోల్ నియోజకవర్గ స్థాయి తెరాస కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.  , జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, అందోల్ తెరాస అభ్యర్థి క్రాంతికిరణ్ కుడా ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ  కుటుంబ సభ్యులకే నచ్చని మ్యానిఫెస్టో ఇక ప్రజాలకేం నచ్చుతుంది.  ప్రజల్లో లేని కాంగ్రెస్ పార్టీ.. ప్రజల మనోభావాలు గుర్తించడం లేదు.  అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి.. రోజుకొకరు పార్టీ మారుతున్నారు.
రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా ఉత్తమ్, జానా నోరు మెదపలేదని విమర్శించారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 మౌలిక ప్రశ్నలు సాధిస్తే.. సమాధానం చెప్పలేక.. డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు.  నది జలాల్లో వాటా, ఆంధ్రలో కలిపిన 7మండలాల తిరిగి ఇస్తారా, పోలవరం డిజైన్ మార్చుతారా అని తెదేపా హామీ ఇచ్చిందా.. ఉత్తమ్ ను అడిగితే అది ప్రజలకు సంబంధం లేదు అన్నాడు.  తెరాస అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్రం మొత్తం 24గంటల విద్యుత్ ఇచ్చిందని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మిర్యాలగూడలో నిర్మించే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసివేస్తామని కోమటి రెడ్డి ప్రకటించారు.  ఇది కోమటి రెడ్డి ప్రకటనా.. కాంగ్రెస్ పార్టీ విధానామా.. స్పష్టం చేయాలి.  పరాయి పాలన, చీకట్ల తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యమా.. ఆ పార్టీ స్పష్టం చెయ్యాలని అయన అన్నారు.
Tags:Congressman Manifesto does not like family members

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *