దీక్షలో పాల్గొన్న కోనేరు హంపి

Connera Humpi participated in the initiation

Connera Humpi participated in the initiation

Date:20/04/2018
విజయవాడ ముచ్చట్లు:
ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష కొనసాగుతోంది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో సాగుతున్న ఈ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు ప్రతినిధులతోపాటు పారిశ్రామిక, సినీ, క్రీడా ప్రముఖులు కూడా శిబిరానికి విచ్చేసి తమ మద్దతు తెలియజేస్తున్నారు. చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి కూడా దీక్షా స్థలికి విచ్చేసి ప్రత్యేక హోదా కోసం తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రత్యేక హోదా కోసం సీఎం చేస్తోన్న పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చి, ముందుకు తీసుకెళ్లి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం ఓ వ్యక్తికి, పార్టీకి ప్రయోజనం కలిగించడానికి చేసే కార్యక్రమం కాదు.. ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్కళ్లూ ఇందులో పాల్గొనాలని హంపి పిలుపునిచ్చారు. మంచి కార్యక్రమం కోసం పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప నిర్ణయం తీసుకోవడం మనందరం ఎంతో ఆనందించదగ్గ విషయమని అన్నారు. మన పోరాటం ఫలించి, తొందర్లోనే మనం అనుకున్నవి నెరవేర్చుకుంటాం, సాధిస్తామని పేర్కొన్నారు. నా కెరీర్ ప్రారంభించినప్పుడు నుంచి ఏదైనా టైటిల్ గెలిచిన తర్వాత ముందుగా చంద్రబాబును కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని అన్నారు. మన రాష్ట్రంలో ఈ రోజున క్రీడలు ఇంతగా అభివృద్ది సాధించాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు కృషే.. ఈ గొప్పదనమంతా ఆయనకే దక్కుతుందని హంపి ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తున్నామని, రాజధాని అమరావతిని కూడా అందరూ గర్వపడేలా నిర్మించుకోవాలని ఆశిస్తున్నానని హంపి తన ప్రసంగాన్ని ముగించారు.
Tags:Connera Humpi participated in the initiation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *