Natyam ad

రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయండి

– ఆర్ ఎస్ యు జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్

కడప ముచ్చట్లు:

ఈనెల 24 25 తేదీల్లో నంద్యాల వేదిక జరుగుతున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్ర ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఈనెల 24, 25 తేదీల్లో నంద్యాలలో రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయని ఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపుగా రాయలసీమ అన్ని ప్రాంతాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని భవిష్యత్తులో రాయలసీమ ప్రయోజనాల కోసం. విద్యారంగ సమస్యలు పరిష్కార సాధన కోసం. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ మిస్ చార్జీలు విడుదల చేయాలని.
ఐటీఐ చదివే విద్యార్థులకు వెంటనే ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని . ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కార సాధన కోసం భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టాలంటే ఈ ప్లీనరీ సమావేశాలు చాలా కీలకమని కావున విద్యార్థిని విద్యార్థులు. రాయలసీమ మేధావులు. ప్రజా ప్రతినిధులు హాజరై సూచనలు సలహాలు ఇచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో. ఆర్ ఎస్ యు నాయకులు సురేంద్ర. సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Conquer State Plenary Sessions

Post Midle

Leave A Reply

Your email address will not be published.