19న జరిగే ముస్లింల బహిరంగ సభను జయప్రదం చేయండి

Date:17/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

కేంద్ర ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా అమలు జరుపుతున్న పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తున్నందుకు నిరసనగా ఈనెల 19న ముస్లింలు చేపట్టిన బహిరంగ సభలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. శుక్రవారం మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, అంజుమన్‌ కమిటి కార్యదర్శి అమ్ము విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను ఏర్పాటు చేసి దేశంలో మత విధ్వంషాలను ప్రోత్సాహిస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈ విషయమై ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధకరమన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 19న పట్టణ ఎన్‌ఎస్‌.పేట మైదానంలో అన్ని కులాలు , మతాలతో కలసి అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు వేలాది మంది తరలిరావాలని కోరారు. ఈ బహిరంగ సభ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా చేయాలని కోరారు.

పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధం

Tags: Conquer the open house of Muslims on the 19th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *