కుట్ర పూరితం

Date:08/11/2018
శ్రీకాకుళం ముచ్చట్లు:
ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం వల్లె తనపై ఆరోపణలు చేస్తున్నారు.  అధికారాన్ని ఉపయోగించి తనతో పాటు మరికొంతమంది ఉద్యోగుల ను బాద్యులను చేసి సిట్ ను ప్రయోగించిందని వైకాపా నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. వైజాగ్ సెజ్ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసారంటూ తనపై చేస్తున్న నిందల్లో ఎటువంటి వాస్తవం లేదు.  ఇది కుట్రపూరితంగా తనపై నెడుతున్నారు. అయినా భయపడేది లేదు.  అసలు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అప్పట్లో బాబు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఈ చట్టం, దళారీ వ్యవస్థను ప్రోత్సహించేది గా ఉందని అన్నారు.  ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ ప్రభుత్వం లో రెవెన్యూశాఖ మంత్రిగా పని చేసేటప్పుడు వైజాగ్ ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారంటూ నన్ను బాధ్యున్ని చేస్తూ  సిట్ అధికారులు తీసుకున్న కుట్రపూరిత ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: Conspiracy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *