భార్యపై కానిస్టేబుల్ దాడి..

కంచికచర్ల ముచ్చట్లు:
కృష్ణాజిల్లా  కంచికచర్ల  కీసర గ్రామానికి చెందిన సునీల్ అనే కానిస్టేబుల్ తన భార్య నవ్య పై దాడి చేసాడు. సునీల్  వత్సవాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న నవ్య ను బంధువుల సహాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సునీల్ తల్లి అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ కావడంతో ఆ అండ చూసుకొని నాపై దాడి చేశారని మా అత్తయ్య గ్రామ సర్పంచ్ కావడంతో సునీల్ కు    ఏమైనా నేను చూసుకుంటా అని ఒక  మహిళని కొట్టలేక పోతున్నావా అని సునీల్ ను రెచ్చగొట్టి  నాపై  దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారని నవ్య ఆరోపించింది. సునీల్ కు  జగ్గయ్యపేట కు చెందిన మహిళతో అక్రమ సంబంధం ఉందని వారికి అడ్డుగా ఉన్నానని నాపై హత్యాప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ్య ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు రక్షణ ఉండవలసిన పోలీసే భార్యపై  తీవ్రంగా దాడి చేయడం మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ  అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Constable assaults wife

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *