Natyam ad

నంద్యాలలో కానిస్టేబుల్ దారుణ హత్య

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు.నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో కిడ్నాప్ చేశారు.అక్కడ నుంచి పట్టణ శివారులోని చెరువుకట్ట ప్రాంతానికి తీసుకొని వెళ్లి కత్తులతో పొడిచి హత్య చేశారు.ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన హత్య ఉదాంతంతో పోలీస్ శాఖ ఉల్లిక్కిపాటుకు గురైంది.విషయం తెలిసిన వెంటనే పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు.మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సురేంద్ర హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Post Midle

Tags: Constable brutally murdered in Nandyala

Post Midle