కానిస్టేబుల్ ఆత్మహత్య

రంగారెడ్డి ముచ్చట్లు:

 

 

నేషనల్ పోలీస్ అకాడమీ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటుంబ కలహాలతో చిన్న చిన్న గొడవలు చివరికి ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ వాసు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి రెడ్డి బస్తీలో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాసుకు వివాహం జరిగి పదిహేను నెలలు అవుతోంది.  గత కొంతకాలంగా అతను మద్యానికి అలవాటు అయ్యాడని,  తరచూ భార్యతో గొడవ పడుతూ ఉంటాడని వాసు భార్య పోలీసులకు తెలిపింది  వాసు డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:Constable commits suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *