కానిస్టేబుల్ పరీక్షా కీ

Constable exam key

Constable exam key

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
అక్టోబరు 8 సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ‘కీ’పై తమ అభ్యంతరాలను నమోదుచేసే అవకాశం ఉంది. అయితే అభ్యంతరాల నమోదుకు సంబంధించి అభ్యర్థులు ఒక్కో ప్రశ్నను వేర్వేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో ‘కీ’ని పొందుపరిచారు.
‘కీ’పై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే తెలియజేయాలి. అక్టోబరు 8 సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ‘కీ’పై తమ అభ్యంతరాలను నమోదుచేసే అవకాశం ఉంది. అయితే అభ్యంతరాల నమోదుకు సంబంధించి అభ్యర్థులు ఒక్కో ప్రశ్నను వేర్వేరుగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో మొత్తం 16,925 పోస్టులకు పోలీస్ శాఖ మే 31న నోటిఫికేషన్ విడుదల చేయగా.. 4,79,158 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,78,567 మందిని ప్రిలిమినరీ రాతపరీక్షకు ఎంపికచేశారు.
పరీక్షకు ఎంపికైనవారిలో 4,49,584 (93.95) శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి సెప్టెంబరు 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ఎంపికచేసిన ప్రదేశాల్లో 966 పరీక్ష కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లోనూ 90కి పైగా హాజరుశాతం నమోదు కావడం విశేషం.
Tags:Constable exam key

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed