వ్యక్తిపై కానిస్టేబుల్ వీరంగం

ఆదోని ముచ్చట్లు:

డ్రంకెన్ డ్రైవ్ సోదాలు జరుపుతున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్ద కాగితాలు లేవని చెప్పడంతో అతడిని ఓ కానిస్టేబుల్ చితకబాది వీరాంగం సృష్టించిన వీడియో పత్తికొండ ప్రాంతంలో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితం ఆదోని రహదారిలో డ్రండెన్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఓ వ్యక్తిని నిలిపారు. తను మద్యం తాగనని వాహనాల పేపర్లు ఇంటి వద్ద ఉన్నాయని కానిస్టేబుల్ కు సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో సదరు కానిస్టేబుల్ అతడిని నడిరోడ్డుపై చితకబాదాడు. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సిసి  ఫోటేజ్ లో రికార్డు అయ్యాయి ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా టీవీ చానల్స్ లలో వైరల్ అయ్యాయి. కాగా గతంలో బెంగళూరుకు వెళ్తున్న ఓ వ్యాపారిని బెదిరించి ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బు దోచుకున్న కేసులో సదరు కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. తిరిగి పత్తికొండలో విధులు నిర్వరిస్తూ సీసీ ఫోటేజ్ ల ద్వారా వైరల్ అయ్యాడు. ఈ విషయంపై సీఐ మురళీమోహన్ ను వివరణ కోరగా వీధుల్లో భాగంగా ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని వివరణ ఇచ్చారు.

 

Tags: Constable on the person

Leave A Reply

Your email address will not be published.