Natyam ad

కానిస్టేబుల్ పూర్ణచంద్రరావు సస్పెండ్

తిరుపతి  ముచ్చట్లు:

 

క్రిమినల్ కేసులో ప్రమేయం ఉన్న కానిస్టేబుల్ పూర్ణచంద్రరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జిల్లా ఎస్పీ   కృష్ణ కాంత్ పటేల్ ఐపిఎస్.29.03.2024 వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొల్లాగుంట గ్రామం లోని ఒక మామిడి తోటలో కొంతమందితో కలసి జూదం ఆడుతూ తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పూర్ణచంద్రరావు పీసీ 964 అనే పోలీస్ కానిస్టేబుల్ కార్వేటి నగరం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ విషయమై కేసు నమోదు చేసి జూదం ఆడిన వారందరినీ అరెస్టు చేశారు. ఒక కానిస్టేబుల్ అయి ఉండి జూదాన్ని అడ్డుకోకుండా వారితో కలిసి జూదం ఆడి అరెస్టయిన కారణంగా, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలలో భాగంగా సదరు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ  .. కృష్ణ కాంత్ పటేల్ ఐపీఎస్., గారు ఆదివారం నాడు ఉత్తర్వులు ఇచ్చారు.

 

Tags: Constable Purnachandra Rao suspended

Post Midle
Post Midle