అనాధ  పిల్లల ఆకలి తీర్చిన కానిస్టేబుల్ శ్రావణ్

 అమ్మ అనాధ ఆశ్రమానికి బియ్యం,సరుకులు పంపిణీ


బెల్లంపల్లి ముచ్చట్లు:

బెల్లంపల్లి టూ టౌన్ కానిస్టేబుల్ శ్రావణ్ తన జన్మదినం సందర్భంగా అనాధ ఆశ్రమ పిల్లలకు బియ్యం, కిరాణ సరుకులు పంపిణీ చేసి వారి ఆకలిని తీర్చారు.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో   విధులు నిర్వహిస్తున్న బ్లూ కోట్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ జన్మదిన సందర్బంగా 2013 సంవత్సరం నుండి నడుపుతున్న అమ్మ అనాధ శరణాలయం లో తన జన్మదిన వేడుకలు అక్కడి అనాధ పిల్లలతో జరుపుకున్నారు. జన్మదినం అంటే చాలు బంధువులు,స్నేహితులు అందరిని పిలిచి వేడుక జరుపుకుంటారు.కానీ చాలా మంది శరణాలయాల్లో జరుపుకోవడానికి ఇష్టపడరు.కానీ శ్రావణ్ కుమార్ మాత్రం పిల్లలతో కలిసి జరుపుకోవడమే కాదు వారికి కావాల్సిన నిత్యావసర సరకులతో పాటు బియ్యాన్ని కూడా అందించి పిల్లల పట్ల  తన మావవీయతను చాటుకున్నారు. నిర్వహకురాలు భాగ్యలక్మి మాట్లాడుతూ 2013 నుండి నడపబడుతున్న అమ్మ అనాధ శరణాలయం శ్రావణ్ కుమార్  లాంటి  అనేక మంది దాతల సహకారంతో ఇప్పటివరకు కొనసాగిస్తున్నామని అన్నారు.వీరితో పాటు హోమ్ గార్డ్ రాజబాబు, ఆశ్రమ పిల్లలు నిర్వాహకులు  పాల్గొన్నారు

 

Tags: Constable Shravan who satisfied the hunger of orphan children

Leave A Reply

Your email address will not be published.