– ఎమ్మెల్యే నన్నపునేని
Date:18/01/2021
వరంగల్ ముచ్చట్లు:
నియోజకవర్గ అభివృద్దే ద్యేయంగా అహర్నిశలు కృషి చేస్తానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం 21 వ డివిజన్ నానమియ తోటలో 49లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు, కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపనేని మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్, ప్రతీ వీదిని అన్నివిదాలుగా అభివృద్ది చేస్తామన్నారు. మౌళిక వసతుల కల్పన, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ లు వరంగల్ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్న ఆయన వారి సహాకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతామన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ది చేపడతామని, అన్ని డివిజన్ లను అభివృద్ది చేసి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మేడిద రజిత మదుసూదన్, కత్తెరశాల వేణుగోపాల్, కేడల పద్మ, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్, డివిజన్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags: Constituency Development Demon