Natyam ad

నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం-మంత్రి పెద్దిరెడ్డి

మడకశిర ముచ్చట్లు:

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హిందూపురము నియోజకవర్గ పరిధిలో   రాష్ట్ర విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, అటవీ, పర్యావరణ & భూగర్భ గనుల శాఖా మంత్రి  మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   ఆధ్వర్యంలో మడకశిర మండలం కేంద్రంలో వై.యస్.ఆర్.సి.పి శ్రేణులతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో మరియు వై.యస్.ఆర్.సి.పి వాల్మీకి సోదర సోదరులతో వేరువేరుగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్   బోయ గిరిజమ్మ  , హిందూపురము నియోజకవర్గ వై.యస్.ఆర్.సి.పి ఎమ్మెల్యే అభ్యర్థి   దీపికా వేణుగోపాల్   పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాటాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అండగా నిలిచి, సమాజంలో సామాజిక సమానత్వాన్ని నిలిపారని,

 

 

Post Midle

రాష్ట్రంలో పెత్తందారుల పాలన కాకుండా, ప్రజా పాలన చేసి చూపించారని, కుటుంబ విలువలను వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా తెలియజేస్తే, రాజకీయ విలువలను దేశానికి చాటిచెప్పిన నాయకుడు జగనన్న అని తెలియజేస్తూ, నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలందరూ సంక్షేమ-అభివృద్ధి పథకాలు భవిష్యత్తులో ఇలానే కొనసాగాలంటే, రానున్న ఎన్నికలలో వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వం అండగా నిలిచి,  దీపిక ని ఎమ్మెల్యే గా,   శాంతమ్మ ని యం.పి గా మరియు జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలకు తెలియజేసి, పార్టీ విజయాన్ని వై.యస్.ఆర్.సి.పి కుటుంబ సభ్యులందరూ వారి భాద్యతగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 

 

ఈ కార్యక్రమంలో హిందూపురము మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, వివిధ కార్పోరేషన్ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక జడ్.పి.టి.సిలు, యం.పి.పి లు, వైస్ యం.పి.పిలు, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల కన్వీనర్లు, వై.యస్.ఆర్.సి.పి అనుభంద విభాగాల అధ్యక్షులు, వై.యస్.ఆర్.సి.పి సీనియర్ నాయకులు మరియు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

Tags:Constituency Level Wide Level Meeting-Minister Peddireddy

Post Midle