27నుంచీ నియోజకవర్గ ప్లీనరీలు –  వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి

29న అన్నమయ్య జిల్లా ఫ్లినరీ

మదనపల్లె ముచ్చట్లు:

 

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాలకు వేదిక కానుంది. ఈ నెల 29 న రాయచోటి నియోజకవర్గ ఫ్లినరీతో పాటు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి ఫ్లినరీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు , ఎంఎల్ఏ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో జిల్లా ప్లీనరీ సమావేశాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. 27న ఉదయం తంబళ్లపల్లెలో., మధ్యాహ్నం మదనపల్లెలో., సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో ఫ్లీనరీ సమావేశాలు జరుగుతాయని వివరించారు. 28న ఉదయం రాజంపేటలో, సాయంత్రం రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఫ్లినరీలు ఉంటాయన్నారు. 29వ తేదీన రాయచోటి నియోజకవర్గ ప్లీనరీ, అన్నమయ్య జిల్లా ఫ్లినరీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ,శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, పార్టీ పరిశీలకులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని తెలిపారు. 29న రాయచోటిలో జరిగే ఫ్లినరీ సమావేశానికి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ లు ఎంపీపీ లు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని విజయవంతం చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

 

Post Midle

Tags: Constituency Plenaries from 27 – YCP District President, MLA Srikanth Reddy

Post Midle