Natyam ad

నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశo -మంత్రి పెద్దిరెడ్డి

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం & రాయదుర్గం నియోజకవర్గాల స్థాయిలో రాష్ట్ర   రాష్ట్ర విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ, అటవీ, పర్యావరణ & భూగర్భ గనుల శాఖా మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలలో ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  బోయ గిరిజమ్మ , పెనుగొండ నియోజకవర్గం శాసనసభ్యులు  మాల గుండ్ల శంకర్ నారాయణ , ఎమ్మెల్సీ మంగమ్మ , రాయదుర్గం నియోజక వర్గ సమన్వయకర్త  మెట్టు గోవింద రెడ్డి , కళ్యాణదుర్గం నియోజక వర్గ సమన్వయ కర్త  తలారి రంగయ్య  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్  మాట్లాడుతూ,బడుగు, బలహీన వర్గాల వారికి పెద్ద పీఠ వేసి, వారికి ఉన్నతమైన పదవులు ఇచ్చి రాజకీయంగా భవిష్యత్తు కల్పిస్తూ, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  అని కొనియాడారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇలాగే అందాలంటే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు డైరెక్టర్లు, సంబంధిత నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల కన్వీనర్లు, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Post Midle

Tags:Constituency Wide Level Meeting – Minister Peddireddy

Post Midle