తిరుపతి కోర్టు కు నూతన భవనం ఏర్పాటు చేయండి
సజ్జల రామకృష్ణ రెడ్డికి న్యాయవాదుల విన్నపం
తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి కోర్టు భవనాలు పాడుబడి పోయాయని వాటికీ నూతన భవనాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తిరుపతి కోర్టు న్యాయవాదులు నెల్లూరు యోగానంద్, ఎన్. రాజా రెడ్డి హైకోర్టు న్యాయవాదులు నరహరి శెట్టి శ్రీహరి, కోటేశ్వర ప్రసాద్, మదన్ మోహన్ రెడ్డి లు మంగళవారం తాడేపల్లి లోని సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయం లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా నెల్లూరు యోగానంద్, ఎన్. రాజా రెడ్డి లు మాట్లాడుతూ తిరుపతి లో ఉన్న కోర్టు భవనాలు బ్రిటిష్ కాలంనాటివని ఇప్పటికే సగం భవనాలు పడిపోయాయని అన్నారు. ఎప్పుడు కూలి పోతాయోనని భయం గా ఉందని, న్యాయవాదులు పెరిగి పోతున్నారని పెరుగుతున్న న్యాయవాదులకు దగ్గ కోర్టు హాలులు లేవని అన్నారు. కోర్టు భవనాలు సరిపోక పోవడం వలన తిరుపతి లోని వివిధ ప్రాంతాలల్లో అద్దె భవనాలల్లో పెట్టడం వలన న్యాయవాదులకు అసౌకర్యం గా ఉందని అన్నారు. ప్రతి రోజు వెయ్యి మందికి పైగా కక్షి దారులు వస్తుంటారని వారికీ మూత్రశాలలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ముఖ్యంగా మహిళలకు చాలా అసౌకర్యం గా ఉందని అన్నారు. వెంటనే మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు నూతన భవనాలు ఏర్పాటు చేసెందుకు సహకరించగలరని కోరారు. తప్పకుండ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెలతానని హామీ ఇచ్చారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు.
Tags: Construct a new building for Tirupati Court
