Construction of 35 kV Substation with Rs

రూ.2 కోట్లతో 35 కెవి సబ్‌స్టేషన్‌ నిర్మాణం

Date:17/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం బండ్లపల్లె పరిసర ప్రాంత ప్రజలకు విద్యుత్‌ అంతరాయం లేకుండ చేసేందుకు రూ.2 కోట్లతో సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి నాగరాజారెడ్డి తెలిపారు. శుక్రవారం విద్యుత్‌శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహులు , ఈఈ కన్‌స్ట్రక్షన్స్ రమణ, ఈఈ ఆపరేషన్‌ విజయన్‌, డీఈ మదనపల్లె బాబర్‌హుహాన్‌, ఏఈ చంద్రమౌలి కలసి సబ్‌స్టేషన్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజారె డ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉండటంతో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమస్యను వివరించామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మంత్రి రూ.2 కోట్లతో సబ్‌ స్టేషన్‌ నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేయించారని తెలిపారు. తక్షణమే 35 కెవి సబ్‌ స్టేషన్‌ పనులను పూర్తి చేసి, ఈ ప్రాంత వాసులకు ఎలాంటి సమస్యలు లేకుండ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బండ్లపల్లె పరిసర ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థల దాత లింగారెడ్డి, మాజీ సర్పంచ్‌లు సుబ్బిరెడ్డి, అగిస్తిరెడ్డి, నారాయణరెడ్డి, పెద్దలు గురివిరెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

19న జరిగే ముస్లింల బహిరంగ సభను జయప్రదం చేయండి

Tags: Construction of 35 kV Substation with Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *