పుంగనూరులో మంచినీటి సమస్య నివారించేందుకు 362 ట్యాంకుల నిర్మాణం- ఎంపీ మిధున్‌రెడ్డి
– జలజీవన్ మిషన్ క్రింద రూ.56 కోట్లు
పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జలజీవన్ మిషన్ క్రింద రూ.56 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కురప్పల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ మంచినీటి సమస్య పరిష్కారం కోసం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను 20 వేల లీటర్ల ఓహెచ్‌ఆర్ లను నిర్మిస్తున్నామన్నారు. ఇందుకోసం జలజీవన్ మిషన్ క్రింద రూ.56 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని కొనియాడారు. అలాగే గండికోట ప్రాజెక్టు నుంచి ఇంటింటికి కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీటిని, రైతులకు సాగునీరు అందించేందుకు పనులు ప్రారంభించామన్నారు. ముప్పెఏళ్ళు గడచినా మంచినీటి సమస్య లేకుండ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం నీటి సమస్య లేకుండ చర్యలు చేపట్టామన్నారు. అలాగే రోడ్లు, కాలువలు, దాదాపు పూర్తికావస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సచివాలయాల ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. ప్రజల వ్యక్తిగత సమస్యలను కూడ పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్, ఏపిఐఐసి చైర్మన్ షమీమ్‌అస్లాం, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, పార్టీ జిల్లా కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, కాంట్రాక్టర్ రాయల జగదీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Construction of 362 tanks to prevent fresh water problem in Punganur- MP Midhun Reddy
