ఏపీలో కొనసాగుతున్న 57 ప్రాజెక్టుల నిర్మాణం

Construction of 57 projects ongoing in AP

Construction of 57 projects ongoing in AP

Date:15/09/2018
శ్రీకాకుళం ముచ్చట్లు
బీజేపీ, వైసీపీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి బోనులో నిలబడే వ్యక్తి కూడా తనను తిడుతున్నాడని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రిని అడ్డంపెట్టుకుని, అడ్డంగా దోచేసి, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో మూడేళ్లుగా తక్కువ వర్షపాతం ఉంది.. ప్రకృతితో అందరం మమేకం కావాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం.
కాటన్‌ దొర రాష్ట్రంలో మూడు బ్యారేజీలు నిర్మించారు. బ్యారేజీల వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో పెనుమార్పులు వచ్చాయి. కేఎల్‌రావు, శివరామకృష్ణ రాష్ట్రానికి దిశ, దశ నిర్దేశించారు. జిల్లాలో 9లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తాం. రాబోయే సీజన్‌ కల్లా రూ.190 కోట్లతో పనులు పూర్తి చేస్తాం. నష్టపోయిన రైతులకు ఉదారంగా పరిహారం ఇచ్చాం. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం. మార్చి నాటికి 27 ప్రాజెక్టులు చేపట్టేలా ముందుకెళ్తున్నాం. రణస్థలం ప్రభుత్వాసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తాం. జిల్లాకు బీ ఫార్మసీ కళాశాల మంజూరు చేస్తాం.
శ్రీకాకుళం జిల్లాలో సమృద్ధిగా వనరులు ఉన్నాయి… జిల్లాను బ్రహ్మాండంగా తయారు చేస్తాం’’ అని చంద్రబాబు వెల్లడించారు.  వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా… జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే బాబ్లీ ప్రాజెక్టుపై పోరాటం చేశానని… మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఎప్పుడో 2010లో జరిగిన దానికి, తనకు ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చారని అన్నారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చినసాన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. తోటపల్లి కాల్వల ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు.ఏపీ ప్రయోజనాల కోసం ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటే… బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని మాట తప్పారని దుయ్యబట్టారు. రెవెన్యూ లోటు రూ. 16 వేల కోట్లు ఉంటే, కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినా, రెండంకెల వృద్ధిని సాధించామని చెప్పారు.
రాష్ట్ర సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దేశ పౌరులు కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి మనం పన్నులు కట్టడం లేదా? అని అన్నారు.త్వరలోనే ఐదు పుణ్య నదులను కలిపి, మహా సంగమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు 175 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని… ఈ జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతానని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా రాష్ట్రం ఉన్నతి కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అందరి చేత జల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చిన్నసాన ఎత్తిపోతల పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎచ్చెర్ల అంబేడ్కర్‌ వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ‘‘కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:Construction of 57 projects ongoing in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *