క్రిష్టియన్ స్మశాన వాటిక నిర్మాణం వేగవంతం చేయాలి

– నెల్లూరు నగర మేయర్ స్రవంతి

నెల్లూరు ముచ్చట్లు:


నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి  సూచనల మేరకు నెల్లూరు 12వ డివిజన్ అల్లీపురం మంగళ దిబ్బ ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న క్రిష్టియన్ స్మశాన వాటిక నిర్మాణ పనులను నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి మంగళవారం పర్యవేక్షించారు. స్మశాన వాటిక నిర్మాణ పనుల పరిశీలనకు విచ్చేసిన మేయర్ ను స్థానిక నాయకులు, ప్రజలు స్వాగతించి పుష్ప గుచ్చాలు అందజేసి, శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అత్యంత నాణ్యతతో స్మశాన వాటిక నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. స్మశాన వాటికలో అవసరమైన ఫుట్ పాత్ లు, మంచినీటి సౌకర్యం, పార్థివ దేహ విశ్రాంతి నిలయం, విద్యుత్ దీపాలు తదితర మౌలిక వసతులను కల్పించి ప్రజలకు సౌకర్యవంతంగా స్మశాన వాటిక ఉండేలా నిర్మించాలని నిర్మాణ కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్, జి.జి.హెచ్ అభివృద్ధి కమిటి సభ్యులు శ్రీనివాసులు, క్రిష్టియన్ మత పెద్దలు, సంబందిత అధికారులు, స్థానిక వై.సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Construction of Christian cemetery should be accelerated

Leave A Reply

Your email address will not be published.