రైతు వేదికల నిర్మాణాలు ఈ నెల 15 లోపు పూర్తి కావాలి

Date:11/09/2020

కామారెడ్డి ముచ్చట్లు:

రైతు వేదికల నిర్మాణాలను క్షేత) స్థాయిలో పర్యవేక్షిస్తూ ఈ నెల 15 లోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.
శుకవారం నాడు ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి, ఆర్ డి ఓలు,స్పెషల్ ఆఫీసర్లు, వ్యవసాయ శాఖ ఎడి, ఎఓ, ఎఇఓలతో క్లస్టర్ వారిగా రైతు వేదికల నిర్మాణ పనులను సమీక్షించారు .
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, వారికి ప్రభుత్వ పథకాలు అందుబాటులో
వుండేందుకు గాను ఉద్దేశించి ప్రారంభించిన రైతు వేదికల నిర్మాణాలను జిల్లాలో త్వరితగతిన
పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన జరుపాలని, పనుల వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. .కాంటాక్టర్లు, ఏజెన్సీలతో సమావేశాలు ఏర్పాటు చేసి పనులు వేగంగా అయ్యేందుకు, పనులు ఆగకుండా రాతి, పూట కూడా జరిపేందుకు ఆర్డీఓలు చర్యలు
తీసుకోవాలని, పూర్తి అయిన చోట నుండి లేబర్ ను అదనంగా వాడుకోవాలని, అనుకున్న
సమయంలో పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. వ్యవసాయ అధికారులు క్షేత) స్థాయిలో
పనులను నిరంతర పర్యవేక్షించేలా జిల్లా వ్యవసాయ అధికారి సమీక్షించాలని, రైతు వేదికలను అన్ని హంగులతో, పెద్ద మొక్కలతో పచ్చదనం ఏర్పాటు చేయాలని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్లు
పనులను పరిశీలిస్తూ మోనిటరింగ్ చేయాలని సూచించారు.సెల్ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టరు పి.యాదిరెడ్డి పాల్గొన్నారు.

 

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నఅధికారులు

Tags:Construction of farmer platforms should be completed by the 15th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *