పుంగనూరులో ఇండ్ల నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలి – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Date:18/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణాలను పటిష్టంగా నిర్మించాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. సోమవారం మున్సిపల్‌ హాల్‌లో పుంగనూరు నియోజకవర్గణలోని అన్ని మండలాలకు చెందిన హౌసింగ్‌ అధికారులు, సిబ్బంది అవగాహన సమావేశాన్ని ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం హాజరైయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇండ్ల నిర్మాణ లబ్ధిదారుల జాబితాలను సత్వరం సిద్దం చేసి, జియోట్యాగింగ్‌ చేపట్టాలన్నారు. అలాగే లబ్ధిదారులు నిర్మించుకునే గృహా వివరాల జాబితా, ప్రభుత్వం నిర్మించే లబ్ధిదారుల జాబితాను సిద్దం చేసి, లబ్దిధారులకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండ పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు పనులు చేపట్టాలని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌, హౌసింగ్‌ డీఈ మధుసూదన్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈలు ప్రసాద్‌, దీన్‌దయాల్‌ తదితరులు పాల్గొన్నారు.

  

అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo

Tags: Construction of houses in Punganur should be done solidly – Akkisani Bhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *