ప్రాజెక్టులు నిర్మాణం భగీరథయత్నమే – చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
-భాధితులను ఆదుకుంటాం.
– మంత్రిని అపార్థం చేసుకోకండి
పుంగనూరు ముచ్చట్లు:

పడమటి నియోజకవర్గాలకు అవసరమైన తాగునీరు-సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుమారు రూ.2.300 కోట్లతో మూడు ప్రాజెక్టుల నిర్మాణం కోసం భగీరథయత్నం చేపట్టారని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కొనియాడారు. శనివారం సోమల మండలంలోని ఆవులపల్లె ప్రాజెక్టు వద్ద జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో మనం జమీందారులు నిర్మించిన చెరువులు మాత్రమే చూస్తున్నామన్నారు. కానీ మంత్రి పెద్దిరెడ్డి సుమారు 6.50 టిఎంసీల నీటిని నిల్వ చేసే మూడు ప్రాజెక్టులను నిర్మిస్తుంటే అడ్డుకోవడం, తప్పుడు కేసులు వేయడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రతి ఒక్కరికి తగిన పరిహారం అందిస్తామన్నారు. ఏ ఒక్కరిని నష్టపరిచేది లేదన్నారు. ఈ విషయంలో వెదవల మాట వినవద్దని కోరారు. మంత్రి కుటుంబం నీతినిజాయితీగా సేవలు అందిస్తున్నారని , ఇలాంటి ప్రాజెక్టులతో పెద్దిరెడ్డి కుటుంభానికి పేరు ప్రఖ్యాతలు వస్తుందని పచ్చనాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడ నిర్మించలేదని తెలిపారు. సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంటే అడ్డుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టి కరిపిస్తారని స్పష్టం చేశారు.
హెలిక్యాప్టర్‌లో ఏరియల్ సర్వే…
ప్రాజెక్టులపై సమావేశం జరుగుతుండగా పచ్చనాయకులు ప్రాజెక్టులను హెలిక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. దీనిపై ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలను ఆదుకోకుండ ఏరియల్ సర్వేలకు లక్షలు ఖర్చు చేసి అడ్డుకోవడం ప్రజలు గమనించాలన్నారు. హెలిక్యాప్టర్‌లో కాకపోతే వాడే నేరుగా వచ్చి సర్వే చేసుకోని ఇక్కడ అన్యాయం జరిగితే కదా భయపడేందుకు అంటు మాట్లాడటంతో ప్రజలు , రైతులు నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు …
పద్నాలుగు సంవత్సరాలలో అభివృద్ధి చేయలేక ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి సహించలేక అడ్డుకునే ప్రయత్నాలు చంద్రబాబునాయుడు చేయడం శోచనీయమని టీటీడీ బోర్డు మెంబరు పోకల అశోక్‌కుమార్ అన్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు ప్రజలు తల్లడిల్లిపోయారని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు సుబిక్షంగా ఉన్నారని కొనియాడారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగుదేశం కనుమరుగౌతుందని తెలిపారు. దీనిని చూసి చంద్రబాబుకు వణుకు పుట్టి,అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, ప్రజలు తగిన శాస్తి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళలసంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె రెడ్డెప్ప ప్రసంగించారు.
Tags; Construction of projects is Bhagirathyatnam – Chittoor MP Reddeppa
